Sep 25, 2026, 16:09 IST/
ఎన్పీఎస్లో కొత్త పథకం: రిటైర్మెంట్తో పాటు ఆరోగ్య భీమా
Sep 25, 2026, 16:09 IST
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో అక్టోబర్ 1 నుంచి 'NPS స్వాస్థ్య' అనే కొత్త పథకం అందుబాటులోకి రానుంది. ఈ పథకం రిటైర్మెంట్ పొదుపుతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇందులో ప్రత్యేక పెట్టుబడి ఖాతా, సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటాయి. వైద్య ఖర్చులను కవర్ చేయడంతో పాటు, ఆరోగ్య అవసరాల కోసం NPS స్వాస్థ్య కార్పస్ నుంచి పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్నవారు చేరవచ్చు, 85 ఏళ్ల వరకు రెన్యూవల్ చేసుకోవచ్చు. నాలుగు రకాల డిడెక్టిబుల్, సమ్-ఇన్ష్యూర్డ్ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి.