
కురుపాం - గుమ్మాలక్ష్మిపురం ప్రాంత ప్రజలకు కాస్త ఉపశమనం
కురుపాం - గుమ్మాలక్ష్మిపురం ప్రాంత ప్రజలు గత మూడురోజులుగా బంగాళా ఖాతాంలో అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షానికీ పొలం పనికి వెళ్ళేవాళ్ళు, దినసరి కూలికి వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. శనివారం కాస్త వర్షం తగ్గుముఖం అవడంతో తరుచు పనికి వెళ్ళే వాళ్ళకు కాస్త ఉపశమనం పొందారు. రైతులు ఎల్నినో ప్రభావం వల్ల వానలు పడవు అని అనుకున్న తరుణంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగయి. రైతులు పొలానికి కావలసిన నంత నీరు వస్తున్నందుకు సంతోషంగా ఉన్నారు.































