Oct 02, 2026, 14:10 IST/
మరణించిన వారి ఆధార్లను డీయాక్టివేట్ చేస్తున్న UIDAI
Oct 02, 2026, 14:10 IST
UIDAI మరణించిన వారి ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసే ప్రక్రియను అమలు చేస్తోంది. 2025లో myAadhaar పోర్టల్లో "Reporting of Death of a Family Member" సేవను ప్రారంభించారు. కుటుంబ సభ్యులు మరణ ధ్రువీకరణ పత్రం, డెత్ రిజిస్ట్రేషన్ నంబర్ సమర్పించడం ద్వారా మరణాన్ని నివేదించవచ్చు. UIDAI వివిధ ప్రభుత్వ వనరుల నుంచి కూడా మరణించిన వారి వివరాలను సేకరించి ఆధార్లను డీయాక్టివేట్ చేస్తోంది. ఇది గుర్తింపు మోసాలను, ప్రభుత్వ ప్రయోజనాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఉద్దేశించబడింది.