
సారిపల్లి పాఠశాల కమిటీ ఎన్నిక: త్రినాథ్ చైర్మన్గా, రోజా వైస్ చైర్మన్గా ఎన్నిక
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామపంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన స్కూల్ కమిటీ ఎన్నికల్లో నడిపిన త్రినాథ్ చైర్మన్గా, పాలేరి రోజా వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు నూతనంగా ఎన్నికైన వారిని సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని త్రినాథ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

































