
పాఠశాల అభివృద్ధికి నూతన కమిటీలు కృషి చేయాలి..శేఖర్
కొమరాడ మండలం మాధలింగి గ్రామంలో మంగళవారం జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్గా రాగాల శంకరరావు, వైస్ చైర్మన్గా మీసాల స్నేహ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్గా హిమరక లక్ష్మణరావు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ మండల అధ్యక్షుడు శేఖర్ పాత్రుడు ముఖ్యఅతిథిగా హాజరై, నూతన కమిటీలు పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.



























