Oct 05, 2026, 11:10 IST/
భారత్లో 60కి పెరిగిన చీతాల సంఖ్య (VIDEO)
Oct 05, 2026, 11:10 IST
మధ్యప్రదేశ్లోని కునో జాతీయ ఉద్యానవనంలో 32 నెలల ఆడ చీతా కేజేపీ21 సోమవారం 5 ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చింది. ఈ పిల్లలతో దేశంలో మొత్తం చీతాల సంఖ్య 60కి చేరింది, వీటిలో 41 చీతాలు భారతదేశంలోనే జన్మించాయి. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, కేజేపీ21 భారతదేశంలో జన్మించి పిల్లలకు జన్మనిచ్చిన మూడో చీతా అని తెలిపారు. ఈ పిల్లల తండ్రి బోట్స్వానాకు చెందిన మగ చీతా కావడంతో, దేశంలో పెరుగుతున్న చీతాల సంఖ్యకు కొత్త జన్యు వంశం చేరినట్లు పేర్కొన్నారు.