Sep 24, 2026, 03:09 IST/
ప్రముఖ డైరెక్టర్ SS రవిచంద్ర కన్నుమూత
Sep 24, 2026, 03:09 IST
టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ డైరెక్టర్ SS రవిచంద్ర(84) హైదరాబాద్లో కన్నుమూశారు. ఈయన స్వగ్రామం ఏపీలోని పాలకొల్లు. హీరో కృష్ణ నటించిన ‘రౌడీ నంబర్ వన్’, ‘కిరాయిగూండా’, ‘సార్వభౌముడు’, ‘దొరగారికి దొంగపెళ్లాం’, బాలకృష్ణ నటించిన ‘దేశోద్ధారకుడు’, ‘అశోక చక్రవర్తి’, వెంకటేశ్ నటించిన ‘అగ్గిరాముడు’, ‘విజేత విక్రమ్’ వంటి చిత్రాలకు రవిచంద్ర దర్శకత్వం వహించారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు.