సాలూరు - Salur

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని వెలమపేట కళ్యాణమండపంలో సుఖీభవ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఆధునిక జీవనశైలి, మానసిక ఒత్తిడి కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని, ముందస్తు పరీక్షలు అవసరమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఎండీ డాక్టర్ పీఎస్వీ రామారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వీడియోలు


నిర్మల్ జిల్లా