
పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయం
శృంగవరపుకోటలో గురువారం వైద్యాధికారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయమని, ఆసుపత్రి అభివృద్ధికి మంజూరైన రూ. 1.75 లక్షల నిధులు ఖర్చు చేసేందుకు కమిటీ ఆమోదం తెలిపిందని ఆమె తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
























