
రబీ నుంచి కొత్త యాప్ ద్వారానే ఎరువుల పంపిణీ
విజయనగరం జిల్లా బొబ్బిలి వ్యవసాయ డివిజన్లో శుక్రవారం రైతు సేవా కేంద్రాల సిబ్బందికి కొత్త ఎరువుల పంపిణీ ఆండ్రాయిడ్ యాప్పై శిక్షణ నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి మండేలా రామారావు, డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు మధుసూదన్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే రబీ సీజన్ నుండి ఈ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ జరగనుంది. రైతులు ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలని, ఎరువుల కొనుగోలు, ధాన్యం సేకరణ, పీఎం కిసాన్ పథకానికి ఇది తప్పనిసరి అని అధికారులు సూచించారు.




































