
దేవి మహిషాసుర మర్దినిగా దేవీ నవరాత్రుల పూజలు
గజపతినగరంలో సోమవారం నాడు ఆశ్వీయుజ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు మహిషాసుర మర్దనిగా భక్తులకు దర్శనమిచ్చారు. దుష్ట శిక్షణ, ధర్మ విజయాన్ని చాటిచెప్పే ఈ పూజల గురించి గజపతినగరం న్యాయవాదుల సంఘం అధ్యక్షులు లంక రాంబాబు మాట్లాడుతూ అమ్మవారిని ఆరాధించడం వల్ల శత్రుభయం తొలగి విజయం లభిస్తుందని పేర్కొన్నారు. చెడుపై మంచి విజయం సాధిస్తుందని, దైవత్వం ద్వారా సమాజ హితం కోరుతూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

































