నెల్లిమర్ల - Nellimarla

డెంకాడ జడ్పిటిసి అభ్యర్థిగా తుమ్మి లక్ష్మి రాజ్ నామినేషన్

డెంకాడ జడ్పిటిసి అభ్యర్థిగా తుమ్మి లక్ష్మి రాజ్ నామినేషన్

విజయనగరం జిల్లా డెంకాడ మండల జడ్పిటిసి స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్ మరియు నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త తుమ్మి లక్ష్మి రాజ్ శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నెల్లిమర్లలో ఎన్నికల అధికారికి ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మి రాజ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, తనను గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వీడియోలు


నిర్మల్ జిల్లా
కొత్తపేట గ్రామంలో దొంగల బీభత్సం
Oct 23, 2026, 15:10 IST/నిర్మల్
నిర్మల్

కొత్తపేట గ్రామంలో దొంగల బీభత్సం

Oct 23, 2026, 15:10 IST
ఖానాపూర్ మండలంలోని. కొత్తపేట గ్రామంలో శుక్రవారం ఒక ఇంట్లో చోరికి పాల్పడ్డారు. గ్రామస్తుల వివరాల ప్రకారం కొత్తపేట గ్రామానికి చెందిన. చింతకుంట శంకర్ కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగ తనం జరిగినట్టు. గుర్తించారు. బీరువాలో ఉన్న 10తులాల వెండి 2తులాల బంగారం 30వేల నగదుఎత్తుకెళ్లినట్టు బాధితుడు తెలిపారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి క్లూస్ టీం తో వేలిముద్ర సేకరించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో పగటిపూట చోరీ అవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.