AP: విజయసాయి రెడ్డి 'పరివర్తన రాజనీతి పార్టీ' (PRP)ని స్థాపించగా, అదే పేరుతో ఇప్పటికే మరొక పార్టీ ఉండటంతో పేరు నమోదుపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో మరో పార్టీ పేరుతో ఉన్న కారణంగా తమ పార్టీకి ఆమోదం రాకపోవచ్చుననే చర్చపై PRP స్పందించింది. పార్టీ పేరు నమోదు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నామని పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. పేరు వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.