జగన్‌లో మరో కోణాన్ని బయటపెట్టిన విజయసాయిరెడ్డి

40చూసినవారు
జగన్‌లో మరో కోణాన్ని బయటపెట్టిన విజయసాయిరెడ్డి
AP: వైసీపీలో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో పార్టీలో తనకు ఎదురైన అవమానాలను ఆయన బహిర్గతం చేస్తున్నారు. తాజాగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరు నేతలు ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవుల కోసం మతమార్పిడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టికెట్ కోసం సువార్త కూటముల్లో ప్రసంగించిన వీడియోను విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, దీనిపై జగన్ స్పందన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్