
అల్లూరి జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: సోమేల స్వామి
వాతావరణ శాఖ ఈనెల 22 నుండి 25 వరకు వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో భారీ వర్షాలు గాలులు ఉరుములు మెరుపులతో వాతావరణం మార్పులు అవకాశం ఉన్నందున అల్లూరి జిల్లా మండలాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మన ఆదివాసీ పరిరక్షణ సమితి అనంతగిరి మండల అధ్యక్షులు సోమేల స్వామి సూచించారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అన్నారు.






































