
చిన్నబజార్ జంక్షన్ లో పైపుకి గండి.. చాల రోజులుగా వృథాగా పోతున్న నీరు
చోడవరం మండలం చిన్న బజార్ వీధి జంక్షన్లో కొళాయి వద్ద నీటి పైపుకు రంధ్రం పడి చాలా రోజులుగా నీరు వృథాగా పోతోంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిష్కారం కాకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.



































