పాడేరు - Paderu

దేవరపల్లిలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

దేవరపల్లిలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

గూడెం కొత్త వీధి మండలం దేవరపల్లి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ పంచాయతీ అధ్యక్షుడు కుమ్మరి రామలింగం ఆధ్వర్యంలో ఆదివారం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో, సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. అనంతరం నాయకులు మల్లికార్జునలు, ఈత రెబ్బలు, తోకచిలుక, బుగ్గిలోవ గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జి. కె. వీధి మీదుగా తీములబంద వరకు దెబ్బతిన్న రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని, పెద్దపాడు, మెట్టగూడ, నక్కబంద గ్రామాల్లో పలువురికి ఓటర్‌ ఐడీ కార్డులు లేవని గ్రామస్తులు, ప్రజలు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మచ్చల మత్స్యరాజు, మండల కార్యవర్గ సభ్యులు దేవరాజు ఉదయభాస్కర్, అణుగూరి రామారావు, కె. సతీష్‌బాబు, జే. బాబురావు తదితరులు పాల్గొన్నారు.

వీడియోలు


కొమరంభీం జిల్లా
మరో రెండు గంట్లో పిడుగులతో కూడిన వర్షాలు
Sep 23, 2026, 17:09 IST/

మరో రెండు గంట్లో పిడుగులతో కూడిన వర్షాలు

Sep 23, 2026, 17:09 IST
TG: రాగల 2 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నిర్మల్, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిద్దిపేట, యాదాద్రి - భోంగీర్, జనగాం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి - కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, గద్వాల జిల్లాల్లో కూడా విస్తారంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  రాత్రిపూట మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.