
మహాకవి జాషువా జయంతి వేడుకలు
అనకాపల్లి, పాయకరావుపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నక్కపల్లి, తెలుగు విభాగం ఆధ్వర్యంలో మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా సాహిత్యంపై ప్రత్యేక ప్రసంగాలు జరిగాయి. వక్తలు ఆయన రచనల్లోని మానవతావాదం, సమానత్వ భావనలు, సామాజిక చైతన్యం, కులవివక్ష, అంటరానితనం వంటి అంశాలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. ఎం శివయ్య, తెలుగు అధ్యాపకులు పృధ్వీరాజ్, రాఘవేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.






























