
దారుణం.. సుపారీ ఇచ్చి మామను చంపించిన కోడలు
యూపీలోని కాన్పూర్లో ఫార్మా వ్యాపారవేత్తను ఆయన కోడలు రూ. 6 లక్షల సుపారీతో హత్య చేయించిన ఘటన కలకలం రేపింది. వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తున్నారని కక్ష పెంచుకున్న కోడలు.. పాత పనిమనిషితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. భర్తతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో హంతకులను ఇంట్లోకి పంపి, నిద్రిస్తున్న మామను 26 సార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేయించింది. ఇంట్లో దొంగతనం జరగకపోవడంతో అనుమానించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హంతకులను గుర్తించి, కోడలే ఈ హత్యకు సూత్రధారి అని తేల్చి నిందితులను అరెస్ట్ చేశారు.




