
ఆనందపురం మండలంలో పర్యటించనున్న బొత్స అనూష
విశాఖపట్నం, భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బొత్స అనూష ఆనందపురం మండలంలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు మండల మాజీ జెడ్పీటీసీ కోరాడ వెంకట్రావు నివాసానికి ఆమె విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన మాజీ ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని ఆనందపురం మండల వైసీపీ అధ్యక్షుడు బంక సత్యం మంగళవారం కోరారు. ఈ పర్యటనలో భాగంగా ఆనందపురంలో వైసీపీ నేతలతో బొత్స అనూష సమావేశం నిర్వహించనున్నారు.


























