గాజువాక - Gajuwaka

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. సీఐటీయూ

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. సీఐటీయూ

విశాఖపట్నం గాజువాకలో జివిఎంసి కాంట్రాక్టు వర్కర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ముఖ్యమైన సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు గొలగాని అప్పారావు మరియు నక్క నాగరాజు మాట్లాడుతూ, విశాఖ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సంక్షేమం దృష్ట్యా జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ మరియు డెత్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కొత్తగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

వీడియోలు


హైదరాబాద్