AP: వివేకా హత్య కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తును ముమ్మరం చేసింది. కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 24న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలతో రావాలని సూచించింది. హత్యకు ముందు, తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని అధికారులు విచారించారు.