
కోటవురట్ల పాఠశాల కమిటీ చైర్మన్గా తుమ్మల శ్రీను ఏకగ్రీవం
మండల కేంద్రమైన కోటవురట్ల పిఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల కమిటీ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. గతంలో పనిచేసిన తుమ్మల శ్రీనునే ఏకగ్రీవంగా చైర్మన్గా, మట్ల జ్యోతిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. స్థానిక సర్పంచ్, టిడిపి నాయకులు, హెచ్ఎం సమక్షంలో నూతన కమిటీ సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు.




































