Sep 04, 2026, 06:09 IST/
భార్యాభర్తల గొడవను నివారించేందుకు వెళ్లిన కానిస్టేబుల్పై కత్తితో దాడి
Sep 04, 2026, 06:09 IST
TG: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో కత్తిపోటు ఘటన కలకలం రేపింది. గురువారం రాత్రి 11.20 గంటలకు గంగోత్రి వాటర్ ప్లాంట్ ఎదుట భార్యాభర్తల గొడవ సమాచారం అందడంతో కానిస్టేబుల్ జాటోత్ రామచంద్ర అక్కడికి వెళ్లారు. పరిస్థితిని తెలుసుకుంటుండగా ఆగపేట తూర్పు తండాకు చెందిన కోటేశ్వర్ కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసి, అనంతరం ఇనుప రాడ్లతోనూ కొట్టినట్లు సమాచారం. ఎడమ చేతి కింద, గుండె సమీపంలో గాయాలైన రామచంద్రకు ఆరు కుట్లు పడ్డాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.