Oct 04, 2026, 02:10 IST/
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
Oct 04, 2026, 02:10 IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనం కోసం సుమారు 18 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. నిన్న ఒక్కరోజు శ్రీవారిని 91,296 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా, 32,805 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.06 కోట్లుగా నమోదైంది.