
డివైడర్ ను ఢీకొని వ్యక్తి మృతి
ఆనందపురం మండలంలోని అనకాపల్లి-ఆనందపురం 16వ జాతీయ రహదారిపై ఆదివారం ఒక ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొనడంతో కర్ణపు అప్పల రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాక మల్కాపురం పరిధిలోని పిలకవానిపాలెం ప్రాంతానికి చెందిన అతను ఆనందపురం నుంచి పెందుర్తి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

























