Oct 07, 2026, 13:10 IST/
TG: దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు
Oct 07, 2026, 13:10 IST
TG: దసరా పండగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 7 వేల ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. హైదరాబాద్ జోన్ నుంచి 2,155, గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1,312 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచేలా ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేసింది. అలాగే, ఈ నెల 25, 26 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి కూడా తగిన ఏర్పాట్లు చేశారు.