చింతపల్లె మండలం - Chintapalle Mandal

హైదరాబాద్
Sep 26, 2026, 08:09 IST/

G9 కోల్ గురించి రేవంత్ రెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం: జగదీష్ రెడ్డి (వీడియో)

Sep 26, 2026, 08:09 IST
TG: సింగరేణిలో G9 బొగ్గు ఉత్పత్తి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని BRS మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 13 గనుల్లో G9 బొగ్గు ఉత్పత్తి అవుతున్నా లేదని అబద్ధాలాడి, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును ఏపీ, కర్ణాటకలకు అక్రమంగా తరలించి రాష్ట్రంలో కొరత సృష్టించారని ఆరోపించారు. యాదాద్రి ప్లాంట్‌పై విమర్శలు సరికాదని, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ విద్యుత్ ఒప్పందాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణాలకు పాల్పడిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు.