
అనంతగిరి : మహిళల భద్రతపై అవగాహన సదస్సు
అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాడేరు మహిళా విభాగం డీఎస్పీ బి. వేణుగోపాల్ విద్యార్థులకు మహిళా చట్టాలు, వన్స్టాప్ సెంటర్ల సేవలు, శక్తి యాప్ వినియోగంపై మంగళవారం అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో శక్తి యాప్లోని ఎస్ఓఎస్ బటన్ ద్వారా పోలీసులకు సమాచారం అందుతుందని తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, గ్రామీణ మహిళలకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.






























