
రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి దుర్మరణం
మధురవాడ చంద్రంపాలెం దుర్గా నగర్కు చెందిన కె.అవినాష్ (30) అనే ఉద్యోగి శనివారం అర్ధరాత్రి మధురవాడ క్రికెట్ స్టేడియం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఐటీ సెజ్ హిల్ నంబర్-2లోని ఓ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్న అతను సిగ్నల్ వద్ద రోడ్డు దాటేందుకు వాహనాన్ని స్లో చేయగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఛత్తీస్గఢ్ లారీ నిర్లక్ష్యంగా ఢీకొట్టింది. సుమారు 200 మీటర్ల మేర ఈడ్చుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.


































