Sep 04, 2026, 01:09 IST/కూకట్పల్లి
కూకట్పల్లి
రణరంగంగా మారిన జేఎన్టీయూ
Sep 04, 2026, 01:09 IST
కూకట్పల్లి జేఎన్టీయూలో తీజ్ వేడుకల్లో ఓ విద్యార్థిపై దాడితో మొదలైన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గౌతమి, మంజీరా హాస్టళ్ల విద్యార్థులు పరస్పరం దాడులకు దిగడంతో క్యాంపస్ రణరంగంగా మారింది. ఈ ఘర్షణలో గాయపడిన విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేపీహెచీ బీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.