Sep 26, 2026, 13:09 IST/
ఇకపై 24 గంటలపాటు ఆర్టీసీలో విచారణ సేవలు
Sep 26, 2026, 13:09 IST
TG: హనుమకొండ బస్స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం 24 గంటలపాటు బస్సుల సమయాలు, సర్వీసుల వివరాలు, ఇతర సమాచారం తెలుసుకోవడానికి ప్రత్యేక సెల్ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. వరంగల్-1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ డిస్ట్రిక్ట్ బస్ స్టేషన్ (డీబీఎస్) కోసం 99592 26056, సిటీ బస్ స్టేషన్ (సీబీఎస్) కోసం 99592 26049 నంబర్లను సంప్రదించవచ్చు. ఈ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.