Oct 16, 2026, 08:10 IST/
బీఆర్ఎస్లో చేరికలు
Oct 16, 2026, 08:10 IST
TG: మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు కిష్టాపూర్ 298 డివిజన్కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు బాసుపల్లి రామ్ రెడ్డి, తన అనుచరులతో కలిసి గురువారం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాబోయే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూడూర్ కిష్టాపూర్ డివిజన్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి కృషి చేస్తానని రామ్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.