ఉత్తర విశాఖ - North Vizag

చింతాడ పాఠశాల ఎస్ఎంసి సమావేశం

చింతాడ పాఠశాల ఎస్ఎంసి సమావేశం

చింతాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ RTI జిల్లా అధ్యక్షుడు అప్పాన సుబ్రమణ్యం, వైస్ ప్రెసిడెంట్ దాసరి అప్పారావు, డైరీ సొసైటీ చైర్మన్ గోపిశెట్టి సత్యారావు, గ్రామ ప్రముఖులు సోములమ్మ, వెంకట మల్లునాయుడు తో పాటు పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, ఎస్‌ఎమ్‌సి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వీడియోలు


హైదరాబాద్
Top 10 viral news 🔥
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!
Sep 30, 2026, 17:09 IST/

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!

Sep 30, 2026, 17:09 IST
దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) పెంపుపై చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగ సంఘాలు బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.7,000 నుండి రూ.21,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగులకు రూ.20,724 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, కొన్ని విభాగాల్లో రోజులు తగ్గించి బోనస్ ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.