Sep 17, 2026, 05:09 IST/
తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
Sep 17, 2026, 05:09 IST
తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం (19వ తేదీ) నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 19 శాతం వర్షపాతం లోటు నమోదైంది. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 42 శాతం లోటు ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.