
విశాఖ హోటల్లో ఆహార భద్రతా అధికారుల దాడులు
విశాఖపట్నంలోని కైలాష్ పారబత్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారం రోజుల క్రితం వండిన గ్రేవీలను ఫ్రిజ్, డీప్ ఫ్రీజర్లో నిల్వ చేసి, తిరిగి వేడి చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో, 46 కిలోల నిల్వ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం హోటల్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.

























