
అనకాపల్లి పోలీసుల మెరుపుదాడి.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న అనకాపల్లి జిల్లా పోలీసులు భారీ అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. ఒడిశా నుంచి కేరళకు తరలిస్తున్న రూ. 5. 5 కోట్ల విలువైన హాషిష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో వి. మాడుగుల ఎస్ఐ నారాయణరావు, సిబ్బంది ఎం. కోడూరు కూడలి వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. పాడేరు ఘాట్ రోడ్డు మీదుగా వస్తున్న ఆటో, మోటారు సైకిల్ను తనిఖీ చేయగా 43 ప్యాకెట్ల హాషిష్ ఆయిల్ దొరికింది. పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.


























