వాతావరణ పరిరక్షణతో పాటు మానవుల జీవనానికి మొక్కలు తోడ్పడతాయని యలమంచిలి ఎమ్మెల్యే యు వి రమణ మూర్తి రాజు అన్నారు. సోమవారం యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో సన్యాసమ్మ చెరువును పబ్లిక్ పార్క్ గా తీర్చిదిద్దడంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి వద్ద ఒక మొక్క నాటాలని సూచించారు. ఈ సన్యాసమ్మ చెరువును చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. యలమంచిలిలో పార్కు ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి జిల్లా మాజీ చైర్మన్ యు వి సుకుమార్ వర్మ, ఎంపీపీ గోవిందు, ఎలమంచిలి పట్టణ వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు ఎర్రయ్య దొర, మున్సిపల్ వైస్ చైర్మన్ లు గుప్తా, నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, డి వీరయ్య, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.