Sep 20, 2026, 01:09 IST/
పెళ్లి పేరుతో మోసం.. మహాభారతం నటుడు సౌరవ్ గుజ్జర్పై కేసు
Sep 20, 2026, 01:09 IST
నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జర్పై కేసు నమోదైంది.పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, శారీరకంగా, మానసికంగా వేధించాడని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. 2021లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై, వాట్సాప్ ద్వారా సన్నిహితంగా మెలిగినట్లు, 2021 డిసెంబర్ 25న తొలిసారి కలిసి భార్యతో సమాన హక్కులు కల్పిస్తానని హామీ ఇచ్చాడని బాధితురాలు వెల్లడించింది. అమెరికాలో ఉన్నప్పుడే కాకుండా, భారత్కు వచ్చిన తర్వాత కూడా కలిసి జీవించామని, వ్యాపారం చేద్దామని నమ్మించి అమెరికా ఉద్యోగం మాన్పించాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. ముంబై ఎయిర్పోర్టులో గుజ్జర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.