AP: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం సవరించింది. మొదట ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్, స్థానిక పైడితల్లి ఉత్సవాల నేపథ్యంలో 29వ తేదీకి వాయిదా పడింది. జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఓట్ల లెక్కింపు తేదీలో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 28న పోలింగ్, 30న కౌంటింగ్ యథాతథంగా కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.