AP: భారత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని సీఎం చంద్రబాబు అన్నారు. హక్కులతో పాటు పౌరుల విధులను కూడా రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. ఓటు అనే శక్తివంతమైన ఆయుధాన్ని బాధ్యతగా వినియోగించుకోవాలని, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లభించిన ఎన్నికల అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.