AP: నంద్యాల జిల్లా, అయ్యలూరులో జరిగిన పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో, ఒక బ్యాలెట్ బాక్స్‌లో ఓటరు వేసిన వినతి పత్రం బయటపడింది. గ్రామంలోని డ్రైనేజీ సమస్యలు, పాఠశాల క్రీడా ప్రాంగణం, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు వంటి సమస్యలను పరిష్కరించాలని ఆ లేఖలో కోరారు. అలాగే పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని, నాబార్డు,16వ ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ ఓటరు తన ఆవేదనను బ్యాలెట్ బాక్స్ ద్వారా అధికారులకు తెలియజేశారు.