AP: పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది. స్థానిక ప్రాథమిక పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద గ్రామస్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల సందడి నెలకొంది. తమ ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చేందుకు ఉదయం నుండే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.