AP: రాష్ట్రంలో వెబ్ ల్యాండ్ డేటాబేస్ హ్యాకింగ్ ముఠాను సీఐడీ అధికారులు పట్టుకున్నారు. ఎన్ఐసీ అధికారి యూజర్ ఐడీ దొంగిలించి రికార్డులు మార్చినట్లు గుర్తించారు. ఫోర్జరీ కేసులో నెట్ వర్క్‌లోని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. విజయవాడ ఎన్ఐసీలో ఔట్ సోర్సింగ్ జూనియర్ డెవలపర్‌గా పనిచేస్తున్న సాయికుమార్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు.