
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడు
ఏలూరు నగరంలో 12 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన సుమారు 60 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు నిమిషాల వ్యవధిలోనే అరెస్టు చేశారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే 112 నంబరుకు ఫోన్ చేయడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వచ్చి విచారణ చేపట్టి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించారు.
































