ఏలూరు నగరంలోని వంగాయగూడెం సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రహదారిపై వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. గత రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.