
ఆహారం చల్లగా ఉందని.. డెలివరీ బాయ్‌పై వ్యక్తి దాడి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో, ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆహారం చల్లగా ఉందని ఫుడ్ డెలివరీ సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. రాణిబాగ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో, మద్యం మత్తులో ఉన్న నిందితుడు డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో వాగ్వాదానికి దిగి, విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతనిపై కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనల్లో నిందితుడు ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




