
పెనుగొండ జడ్పీటీసీ రేసులో మామిడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ
ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ జడ్పీటీసీ టికెట్ ఎవరికి దక్కుతుందన్న అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సిద్ధాంతం గ్రామానికి చెందిన విద్యావేత్త మామిడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ పేరు తెరపైకి వచ్చింది. ఆయన గతంలో అంబులెన్స్ విరాళం ఇవ్వడం, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం మరియు ఉచిత వైద్య శిబిరాల వంటి సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందారు. ప్రజాసేవలో చురుగ్గా ఉన్న ఆయనకు టికెట్ ఇస్తే, మండలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు జరుగుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.





























