
నరసాపురంలో వైభవంగా ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వై ఎన్ కాలేజ్ రోడ్డులోని ఆర్యవైశ్య రామాలయంలో, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. విజయదశమి సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు మరియు శమి పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన వాహనోత్సవంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ ఉత్సవాలు స్థానికంగా భక్తుల విశేష ఆదరణ మధ్య వైభవంగా సాగాయి.






































