
శ్రీ సరస్వతీ దేవిగా పెనుగొండ శ్రీ వాసవి మాత
పెనుగొండ గ్రామం వాసవి ధామ్ లో అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ ప్రజ్ఞ నంద సరస్వతి బాల స్వామీజీ పర్యవేక్షణలో శరన్నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవంగా జరుగుచున్నవి. శుక్రవారం మూలా నక్షత్రం, ఆరవ రోజులో భాగంగా శ్రీ వాసవి మాతను శ్రీ సరస్వతి దేవిగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.


























